టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు భామలకు అవకాశాలు వచ్చినా హీరోయిన్ గా కాకుండా సైడ్ క్యారెక్టర్స్ లాంటివి అడపాదడపా వస్తుంటాయి. దానికి కారణం సినిమాలలో ఎక్స్ పోజింగ్ చేయడానికి వ్యతిరేకించడం ముఖ్యకారణం అయితే… నార్త్ భామలకు ఉన్నంత అందమైన లుక్స్ ఉండవన్న భావన కూడా ఉంది.

ఇక వరంగల్ కు చెందిన అందాల పాపా ఈషా రెబ్బ కూడా చిన్న చిన్న సినిమాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. కానీ ఈమధ్య సినిమా అవకాశాలు తగ్గడంతో తనలోని మరో యాంగిల్ చూపించడానికి రెడీ అయ్యిందట. హాట్ హాట్ స్పైసీ బికినీతొ త్వరలో తన అభిమానులతో పాటు, ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఈషా రెబ్బ హీరోయిన్ గా రిలీజ్ కు సిద్ధమవుతున్న “రాగల 24 గంటలలో” సినిమాతో పూర్తిగా తన అందానికి కొత్త రూపం తెచ్చి మరోసారి ఇండస్ట్రీలో తన సత్తా చాటడానికి ఉవ్విళూరుతుందట. వరంగల్ పాప చెప్పినట్లు హల్ చల్ చేస్తుందో లేక తట్టా బుట్ట సర్దుకొని వరంగల్ చెక్కేస్తుందో త్వరలో తేలిపోతుంది.  
  •  
  •  
  •  
  •  
  •  
  •