పని ఒత్తిడిలో పడి కొంతమంది ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేస్తుంటారు, ఇలాంటి సంఘటనలు ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీలలో జరుగుతుంది. పక్కనే ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని లేవడానికి కూడా బద్దకమయ్యేలా పని ఒత్తిడితో ఒక్కోసారి ఎంత సేపు పనిచేస్తున్నామో కూడా మర్చిపోతుంటారు. అలాంటి వారిని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు అలెర్ట్ చేస్తున్నారు.

గంటల తరబడి ఎక్కువగా కూర్చునే వారికి డయాబెటిస్, గుండెపోటు, మతిమరుపు, జ్ఞాపకశక్తి పూర్తిగా కోల్పోవడంతో పాటు వెన్ను నొప్పి కూడా వస్తుందట. అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం కనీసం గంటకొకసారి లేచి అటు ఇటు ఒక ఐదు నిమిషాలైనా తిరగాలని చెబుతున్నారు. ఒకవేళ మీకు అటుఇటు తిరిగే అవకాశం లేకపోయినా, ఒక రెండు నిమిషాలైనా అలా కూర్చున్న ప్రదేశం నుంచి నిలబడటం మంచిదని తెలియచేస్తున్నారు.