కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్ళు పైబడిన వృద్దులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. అంతేకాకుండా కరోనా బాధితులు స్వీయ నిర్బంధంలో ఉన్నవారికి కూడా ఈ అవకాశాన్ని కల్పించింది. ఈ ఏడాది చివరిలో బీహార్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున ఎన్నికల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం గెజిట్‌ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇప్పటి వరకు ఎన్నికల విధులు నిర్వహించే పరిపాలన సిబ్బంది, పోలీసులు విదేశాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరికొంత మంది సిబ్బందికి కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసుకునే వీలుంది. కరోనా భారిన పడి చికిత్స పొందుతున్న వారు బయటకి వచ్చి ఓటు వేయడం ద్వారా ఇతరులకు వైరస్ సోకె ప్రమాదం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా సీఈసీ అభిప్రాయపడింది.

టిక్ టాక్ కు ఎంత నష్టమో తెలిస్తే కంగుతింటారు

నాపై ధిక్కార స్వరాలు అన్ని సీఎం జగన్ కనుసన్నలలో నడుస్తున్నాయా? నమ్మలేకున్నా