అవును బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎక్కడ చూసిన ట్యాలెంటెడ్ ఆర్టిస్టులను తొక్కేసి, నెపోటిజం(బంధుప్రీతి)కి ఎక్కువ విలువ ఇస్తారు. ఇక ఒక పెద్ద హీరో బంధువైతే చాలు అతడిని నెత్తిన పెట్టుకొని అతడికి ట్యాలెంట్ ఉందా లేదా అన్న విషయం కూడా పట్టించుకోరు. కానీ కృష్ణానగర్ నుంచి ఫిల్మ్ నగర్ వరకు రోజు నడుచుకుంటూ తన ట్యాలెంట్ నిరూపించుకోవడానికి ఎన్నో కస్టాలు పడే ఒక సామాన్యుడికి మాత్రం అసలు ఛాన్స్ మాత్రం ఇవ్వరు. ఇక వీటితో పాటు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కులాల రచ్చ ఉండనే ఉంది.

ముందు బంధుప్రీతికి భజన చేస్తే ఆ తరువాత అతడి కులాన్ని బట్టి ఆఫర్స్ ఇస్తుంటారు. ఇక ఆ తరువాత భజన పరులు ఇలా మొత్తం అయిపోయాక వడపోతలో ఎక్కడో ఒక సూపర్ ట్యాలెంట్ ఉన్న అతడికి ఎవరో కొత్తగా వచ్చిన నిర్మాతో దయ తలిస్తే అప్పటికి అతడి ట్యాలెంట్ నిరూపితమవుతుంది. ఇదంతా జరిగాక సినిమా విడుదల చేయాలంటే ముందు భజన బ్యాచ్, ఆ తరువాత మన కులపొడికే థియేటర్స్… తరువాత భజన పరులకు ఇలా అందరకి థియేటర్లు కేటాయించిన తరువాత ఆ కొత్త నిర్మాత, కొత్త హీరో, కొత్త దర్శకుడు కలసి తీసిన సూపర్ ట్యాలెంటెడ్ సినిమాకు విరిగిపోయిన సీట్లు, ఎలుకలు తిరుగుతూ పాడుపడిపోయిన థియేటర్లను కేటాయిస్తారు.

కానీ వాటికి మన ప్రేక్షకులు అసలు వెళ్లరు కదా. ఆ తరువాత ఎప్పుడో టివిలో వేస్తేనో లేకపోతే OTTలో రిలీజ్ అయితేనో మనం చూసి అబ్బా ఇలాంటి సినిమా మనం మిస్ అయిపోతున్నామా అని బాధపడిపోతుంటాం. కానీ ఇంత బాధపడిపోయే మనం ఎలాంటి ట్యాలెంట్ లేని హీరోని మాత్రమే నెత్తిన పెట్టుకొని, ఎవరి కులానికి వారు సపోర్ట్ చేస్తూ కీర్తిస్తుంటాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తరువాత కాస్త ట్యాలెంటెడ్ హీరోలను గుర్తిస్తున్నారనుకోండి.

దీనిపైనే మన తెలుగమ్మాయి ఈషా రెబ్బా స్పందిస్తూ, ట్యాలెంట్ ఉంటేనే పైకొస్తారని, ట్యాలెంట్ లేకుండా బంధుప్రీతితో పైకెదగలేరని చెబుతుంది. కానీ ఈషా రెబ్బ చెప్పేది తప్పు. బంధుప్రీతి ఉంటే, ఎలాగోలా భజన బ్యాచ్ వలన సినిమాను నడిపించేయవచ్చు. ముందు ట్యాలెంట్ ఉన్నాడు పైకి రావాలంటే, అతడి సినిమా విడుదలవ్వాలంటే సరైన థియేటర్లు దొరకాలి కదా. అవి కేటాయించేది ఎవరు. మన నెపోటిజం బ్యాచ్ నే కదా. బాలీవుడ్ విషయంలో సుశాంత్ పరిస్థితి కూడా అలానే ముగిసిపోయింది.

మెగా కుటుంబానికి “పవర్ స్టార్” సినిమా కంటెంట్ ముందే లీకైందా?