తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి నారాయణ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు. 2014 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమరావతికి సంబంధించి వ్యవహారాన్ని మొత్తం నారాయణ చేతిలో పెట్టారు అప్పటి సీఎం బాబు. నిన్నటి నుంచి కూల్చివేతకు గురవుతున్నా ప్రజావేదిక భవనం కూడా నారాయణ కనుసన్నలలోనే జరిగింది. కావాలనే ఆ భవనం ఖర్చు దాదాపుగా రెండింతలు పెంచి బొక్కేశారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల మధ్యలో నిర్మాణ ఖర్చయ్యే ప్రజావేదిక భవనాన్ని అనూహ్యంగా దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించారు. 

నిన్నటి నుంచి ప్రజావేదిక భవనం కూల్చివేతకు గురవుతున్నా నారాయణ ఎక్కడ ఉన్నారో అంతుపట్టడం లేదట. తెలుగుదేశం నాయకులతో పాటు, చంద్రబాబు నాయుడుకి కూడా టచ్ లోకి రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొన్నారని తెలుస్తుంది. నారాయణ వ్యవహారంపై తెలుగుదేశం నేతలు బగ్గుమంటున్నట్లు తెలుస్తుంది. అధికారం ఉన్నప్పుడు అందరిపై చెలాయించుకొని ఇప్పుడు అధికారం కోల్పోగానే తనకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే నారాయణ బీజేపీ నేతలతో మంతనాలు చేసాడని, కానీ వైసీపీలోకి వెళ్లాలన్న కోరిక బలంగా ఉన్నట్లు నెల్లూరులో గుసగుసలు వినపడుతున్నాయి. వైసీపీ అధినాయకత్వంతో స్మూత్ గా డీల్ చేసి నారాయణ కాలేజీలకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఆలోచిస్తున్నాడట. కానీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం నారాయణ రాకను అడ్డుకొంటునట్లు తెలుస్తుంది. నారాయణను పార్టీలోకి తీసుకుంటే క్యాడర్ కు తప్పుడు సంకేతం ఇచ్చినట్లు అవుతుందని అనిల్ అంటున్నారట. 
  •  
  •  
  •  
  •  
  •  
  •