ఏపీ రాజధాని అమరావతి పై ఇంకా రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యలు చేసిన తర్వాత అమరావతి విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. ఇప్పుడు తాజాగా తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ రాజధాని గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతిని మార్చి తిరుపతిని రాజధానిని చేస్తున్నారని వ్యాక్యలు చేశారు. సీఎం జగన్ కి అమరావతి నుండి ఇక తిరుపతికి రావాలని సూచించారు. రాజధానిగా తిరుపతి ఖాయమని.. రాజధానికి అమరావతి చాలా అనుకూలమైన ప్రాంతమని ఆయన అన్నారు.

ఇక హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చెయ్యబోతున్నారంటూ ఈ మధ్య కాలంలో వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై కూడా చింత మోహన్ స్పందించారు. హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తున్నారని.. కేంద్రం దీనిపై ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తన దగ్గర రహస్య సమాచారం కూడా ఉందని చింత మోహన్ తెలియచేసారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •