పెద్దపల్లి మాజీ ఎంపీ వివేకా ఈరోజు భాజపాలో చేరబోతున్నారు. అమిత్ షా సమక్షంలో వివేక్ బీజేపీ కండువా కప్పుకొని తెలంగాణ నుంచి కీలక పదవిలో భాజపాకు సేవలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికలలో పెద్దపల్లి నుంచి టిఆర్ఎస్ పార్టీ తరుపున పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని అనుకున్నా తన అన్న వినోద్ చేసిన రచ్చతో కేసీఆర్ వెనక్కు తగ్గినట్లు గుసగుసలు వినిపించాయి. 

ఇక ఆ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో అప్పుడే భాజపా పార్టీ ఎంపీ టికెట్ వివేక్ కు ఆఫర్ చేసింది. కానీ వివేక్ అప్పుడు పోటీ చేయకపోవడంతో కొంత బాధ పడినట్లు తెలుస్తుంది. గత పార్లమెంట్ ఎన్నికలలో అనూహ్యంగా బీజేపీ తెలంగాణాలో నాలుగు పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవడంతో నేను కూడా భాజపా నుంచి పోటీ చేస్తే గెలిచేవాడిని ఆశించాడట.

ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికలే ధ్యేయంగా బీజేపీ పార్టీ తెలంగాణాలో జెండా ఎగరవేయడానికి చూస్తున్న క్రమంలో వివేక్ బీజేపీలో చేరడం అతని కన్నా బిజెపికి ఎక్కువ లాభం అని చెప్పుకోవచ్చు. తెలుగురాష్ట్రాలలో సరైన మీడియా సహకారం లేక బీజేపీ పార్టీ కొంత ఇబ్బంది పడుతుంది. వివేక్ చేరికతో బలమైన మీడియాతో పాటు, పత్రిక కూడా బీజేపీకి అండగా నిలవనుండటంతో ఎలాంటి వ్యూహాలతో బీజేపీ తెలంగాణాలో ముందుకు వెళుతుందో చూడాలి.

 


Tags: Bjp, Vivek


  •  
  •  
  •  
  •  
  •  
  •