ఎన్నికలకు కొద్ది రోజులు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి మార్చ్ 15వ తారీఖున హత్యకు గురికాబడ్డారు. బాత్ రూమ్ లో అత్యంత కిరాతకంగా గొడ్డలితో తలపై నరికి చంపివేశారు. ఎంతో మృధుస్వభావిగా పేరున్న వివేకా హత్య కడప జిల్లా ప్రజలతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా అందరని కలచి వేసింది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ సిట్ ఏర్పాటు చేసి వివేకా హత్య కేసుపై త్వరలో నిగ్గుతేలుస్తామని తెలియచేసారు.

ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు వారిలో వారే చంపుకొని ఇప్పుడు నాటకాలాడుతున్నారని వైసీపీ అధినేత జగన్ కుటుంబంపై ఎన్నో ఆరోపణలు చేశారు. ఇక ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూడా సీబీఐ ఎంక్వయిరీ లేదా థర్డ్ పార్టీతో ఎంక్వయిరీ చేయాలనీ డిమాండ్ చేశారు. సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత పాత సిట్ అధికారులను తొలగించి ఆ స్థానంలో కొత్త సిట్ ను నియమించి పులివెందుల మొత్తం జల్లెడ పట్టించడమే కాకుండా దాదాపుగా వందల మందిని విచారించినట్లు తెలుస్తుంది. ఇక ఏకంగా నలుగురిపై నార్కో అనాలసిస్ టెస్ట్ లు కూడా చేశారు.

ఇదంతా ప్రాసెస్ జరుగుతున్న సమయంలో శ్రీనివాసుల రెడ్డి అలియాస్ బద్వేల్ శ్రీను అనే వ్యక్తి చనిపోవడంతో కేసు మరో మలుపు తిరిగింది. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టినా ఇంతవరకు కేసు ఒక కొలిక్కి తీసుకురావడంలో విఫలమయ్యారని, పరిటాల రవి కేసులో నిందితుడు మొద్దు శ్రీనుని చంపేసినట్లు, వైఎస్ వివేకానంద రెడ్డి కేసును కూడా నీరు ఖర్చెందుకు శ్రీనివాసుల రెడ్డిని హత్య చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.

మరో వైపున మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా దమ్ముంటే తన బాబాయ్ కేసులో నిందితులు ఎవరో సీఎం జగన్ బయటపెట్టాలని, లేకపోతే సీబీఐకు ఇచ్చి కేసును ఒక కొలిక్కి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు సవాలు విసిరారు. నేరుగా చంద్రబాబు నాయుడుపైనే నిన్న విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శలు చేయడంతో… ఈరోజు సీబీఐ ఎంక్వయిరీ చేసుకోవచ్చని చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే అసలు కేసులో నిందితులు ఎవరో తెలియక బుర్రలు వేడెక్కుతున్నాయి.

మరోవైపున నెటిజన్లతో పాటు తెలుగుదేశం నేతలు కూడా ఎన్నికల ముందు సీబీఐ చేత విచారణ చేయాలన్న జగన్ ఇప్పుడు ఎందుకు సీబీఐకు అప్పగించడం లేదని… నిన్న శ్రీనివాసుల రెడ్డి చనిపోయిన దగ్గర నుంచి ఈ విషయాన్ని తెర మీదకు తీసుకురావడంతో, నేరుగా ఇప్పుడు ఈ కేసు విషయమై డీజీపీ గౌతమ్ సవాంగ్ పులివెందుల వెళ్లడంతో… సీఎం జగన్ రెండు రోజులలో వైఎస్ వివేకానంద రెడ్డికి కేసుకు సంబంధించి ప్రాధమిక విచారణ ఎంత వరకు జరిగిందో రిపోర్ట్ అడగడంతో వచ్చే రెండు రోజులు ఏమి జరుగనుందా అని అందరూ ఉత్కంటతకగా ఎదురు చూస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •