ప్రస్తుతం దేశంలో డిజిటల్ పేమెంట్స్ కు మంచి డిమాండ్ ఉంది. వీటికి సంబంధించి గూగుల్ పే, పేటీఎమ్, ఫోన్ పే యాప్ లకు మంచి డిమాండ్ ఉంది. ఈ యాప్ లను ఉపయోగించే వినియోగదారులకు మంచి మంచి ఆఫర్ లను ఇస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా దిగ్గజం పేస్ బుక్ కూడా “పేస్ బుక్ పే” అనే కొత్త ఆప్షన్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసుకొనే అవకాశం కల్పిస్తుంది.

మన ఫోన్ లలో పిన్ లేదా బయో మెట్రిక్ వంటి ఆప్షన్ల ద్వారా డబ్బు పంపడానికి ఈ యాప్ అనుమతి ఇస్తుందన్నారు. యూజర్ల కోసం చాల సంస్థలు ఈజీ ఆప్షన్ తీసుకు వస్తుండటంతో ఇప్పుడు పేస్ బుక్ కూడా ఈ ఆప్షన్ ను తీసుకువచ్చింది. మరికొద్ది రోజులలో వాట్సాప్ కూడా డిజిటల్ ప్రెమెంట్స్ యాప్ తీసుకురానున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి కార్యాచరణ కూడా జరుగుతుంది. దీనితో డిజిటల్ పేమెంట్స్ విధానం మరింత విస్తృతం చెంది ఇప్పటి వరకు నగరాలు, పట్టణాలలో ఉన్న డిజిటల్ పేమెంట్స్ విధానం మరింత ఎక్కువగా ముందుకు చేరి గ్రామీణ ప్రాంతాలలో కూడా డిజిటల్ పేమెంట్స్ కు మరింత ఆదరణ లభించే అవకాశం ఉంది.