సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ డేటా పోర్టబులిటీ ఫిచర్ ను తీసుకువచ్చింది. ఫేస్‌బుక్ సర్వేర్ లో సేవ్ చేసిన డేటాను గూగుల్ ఫొటోస్ వంటి మిగతా ప్లాటుఫారంలకు ట్రాన్సఫర్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ ఫిచర్ ను గురువారం నుండి కెనడా, అమెరికా వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఈ డేటా పోర్టబులిటీతో వినియోగదారులకు తమ డేటాపై మరింత నియంత్రణ ఉండే వెసలు బాటు ఉంటుందన్నారు. దీంతో ఫేస్‌బుక్ లో అప్లోడ్ చేసిన ఫోటోలను, వీడియోలను వినియోగదారుడు కావాలంటే నేరుగా గూగుల్ డ్రైవ్ వంటి మరో సర్వీస్ ప్రొవైడర్ లోకి అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఒకవేళ ఫేస్‌బుక్ లో ఫోటోలు, వీడియోలు డిలీట్ అయిన లేదా ఖాతానే డిలీట్ అయినా డేటా మాత్రం గూగుల్ డ్రైవ్ లో సురక్షితంగా ఉంటుంది. కాగా గత రెండేళ్లుగా ప్రభుత్వం నుండి పలు సూచనలు రావడంతో ఫేస్‌బుక్ వినియోగదారులకు ఈ వెసులుబాటును కల్పించింది.