ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్” చిత్రంతో ఎంతో బిజీగా ఉన్న రాజమౌళి తన తదుపరి సినిమా మహేష్ బాబు, ప్రభాస్ ఇద్దరి కలయికలో ఉంటుందని, అది ఒక పిరియాడికల్ సినిమా అని “బాహుబలి:ని మించే స్థాయిలో ఆ సినిమా ఉంటుందని ఇలా అనేక వార్తలు గత మూడు రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. రాజమౌళి ఎప్పుడో మహేష్ బాబుతో సినిమా చేయాలనీ అది ఇప్పటికి కుదిరిందని దీనికి కేఎల్ నారాయణ నిర్మాతగా ఉంటారని ఇలా అనేక వార్తలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వర్గం మాట్లాడుకుంటుంటే మరొక వర్గం మాత్రం ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపడేస్తుంది.

అసలు రాజమౌళి ముందుగా ఎట్టి పరిస్థితులలో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ త్వరితగతిన పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కిందా మీద పడుతున్నారు. ఇంకా షూటింగ్ పార్టీ 25 శాతం మిగిలే ఉంది. రాజమౌళి ఒక సినిమాపై ద్రుష్టి పెట్టినప్పుడు తదుపరి సినిమా గురించి ఆలోచించే ప్రసక్తే లేదని, అసలు అతడి సినిమా వెనుక సినిమా రావడం కూడా జరగదని, బాహుబలి సినిమా విడుదల తరువాత ఏకంగా ఏడాదికి పైగా ఖాళీగా కూర్చుని అప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ఆలోచించారని కానీ ఇలా ముందుగా ఏ సినిమాపై ఆలోచించే ప్రసక్తి లేదని చెప్పుకొస్తున్నారు.

రాజమౌళి మెంటాలిటీ మొదటి నుంచి అలాగే ఉంటుంది. తాను మొదలు పెట్టిన సినిమా మంచి విజయం సాధించిన తరువాత… అతడి తదుపరి ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడతారు. కావాలని ఎవరో మహేష్ బాబు – ప్రభాస్ అంటూ ఎవరో పుట్టిస్తున్నట్లు ఉంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తుంటే, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాను దాదాపుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ఇంకా విడుదలకు ఏడాది సమయం ఉండగానే బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •