డబ్బు కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగట్టడానికి సిద్ధమవుతున్నారు కొంతమంది ప్రబుద్ధులు. సొంత కూతురని కూడా చూడకుండా అమ్మకానికి పెడుతున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి రాజస్థాన్ లో జరిగింది. 13 ఏళ్ళ తన కన్న కూతురుని ఏడు లక్షల రూపాయలకు అమ్మేశాడు ఒక దుర్మార్గపు తండ్రి. రాజస్థాన్ బర్మార్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరగగా తన అన్న కూతురు కనపడటం లేదని ఆ పాప బాబాయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు.

పోలీసులు ఎంక్వయిరీ చేస్తుండగా తాజాగా ఆ బాలిక హైదరాబాద్ లో ఉన్నట్లు రాజస్థాన్ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తండ్రితో పాటు మరొక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆ బాలిక బాబాయి కనుక పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయినట్లైతే ఆ బాలిక ఆచూకి తెలిసేది కాదని బంధువులు అంటున్నారు.