భార్యతో గొడవ పడితే ఆ సమస్య ఆమెతోనే తీర్చుకోవాలి. అలా కాకుండా ఒక పసికందుని హత్య చేసి దుర్మార్గంగా వ్యవహరించాడు ఢిల్లీకి చెందిన ముకేశ్ అనే వ్యక్తి. ఢిల్లీలోని బిందాపూర్ ప్రాంతానికి చెందిన ముకేశ్ తన భార్య కిరణ్ తో గొడవ పడ్డాడు. తన భార్య పుట్టింటికి వెళ్లే విషయంలో జరిగిన గొడవ చిలికి చిలికి గాలి వానలా మారడంతో ఆ కోపం పట్టలేక తన 20 రోజుల కుమార్తెను గదిలోకి తీసుకొని వెళ్లి తలుపు వేసుకొని గొంతు కోసి ఆమెను టబ్ లో ముంచివేసినట్లు తెలుస్తుంది. ఈ ఘాతుకంతో పోలీసులు ముకేశ్ ను అరెస్ట్ చేసారు. 2018 లో ముకేశ్ తో కిరణ్ కు పెళ్ళైనట్లు తెలుస్తుంది. ఇంతటి గోరానికి పాల్పడిన ముకేశ్ ను కఠినంగా శిక్షించాలని అందరూ కోరుతున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •