దక్షిణాఫ్రికా జట్టు 162 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాలలో కూరుకుపోయి ఉంటే, ఇంకో 10 పరుగులకు ఆల్ ఔట్ అవుతారని అనుకుంటే టెయిలెండర్లు మహారాజ్, ఫిలండెర్ సూపర్ బ్యాటింగ్ తో భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. బౌలర్ మహారాజ్ 72 పరుగులు చేసి ఔట్ అవ్వగా, ఫిలండెర్ 44 పరుగులు చేసాడు. వీరిద్దరి జోడీని అశ్విన్ విడతీయడంతో మొత్తానికి సఫారీల జట్టు పోరాడి 275 పరుగులకు ఆల్ ఔట్ అయ్యారు.

టీమిండియా బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు, ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు, షమీ రెండు, జడేజా ఒక్క వికెట్ తీసుకున్నాడు. ఇక ఫాలో ఆన్ సఫారీల చేత ఆడించకుండా టీమిండియా ఒక సెషన్ బ్యాటింగ్ చేసి చకచక ఒక 150 పరుగులు చేసి 450 పరుగులకు పైగా లీడ్ ఇచ్చి సౌతాఫ్రికాకు బ్యాటింగ్ అవకాశం ఇవ్వవచ్చు. ఇప్పటికే భారత్ కు 326 పరుగుల లీడ్ ఉంది. ఇంకొక రెండు రోజులు ఆట మిగిలి ఉంది.