ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ సంయుక్తంగా కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిని ఆగష్టు 15న మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ చివరి ట్రయల్స్ మానవులపై ప్రయోగం చేయబోతున్నారు. ఇక ఈ వ్యాక్సిన్ మొదటి ట్రయల్స్ ను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వాలంటీర్ చిరంజీత్ ధీవర్‌పై ప్రయోగించనున్నట్లు తెలుస్తుంది. భువనేశ్వర్ సెంటర్‌లో ఈ టీకాను పరీక్షించనున్నారు. మొదట పట్నా కేంద్రంలో ఈ పరీక్ష నిర్వహించాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు భువనేశ్వర్ కేంద్రంలో ఈ పరీక్ష చేయాలని నిర్ణయించారు.

చిరంజీత్ ధీవర్‌ బెంగాల్లోని దుర్గాపూర్‌లో పాఠశాల ఉపాద్యాయుడు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారత జాతీయ విద్యా సమాఖ్య ప్రాథమిక యూనిట్ రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యుడు. ఇక చిరంజీత్ కి ఈ విషయంపై ఫోన్ వచ్చింది. ఈ టీకా పరీక్షకు ఎప్పుడు రావాలో తెలియచేస్తామని.. అధికారులు అతనికి తెలియచేసారు. ఇక ఈ పరీక్షకు తాను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నానని చిరంజీత్ తెలిపారు. చిరంజీత్ తండ్రి తపన్ ధీవర్ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ పరీక్షకు తన కొడుకు ముందుకు రావడం అందరూ మెచ్చుకుంటున్నారని తెలిపాడు.

first corona trailes

భారత్ లో 20000 దాటిన కరోనా మృతులు..! కేవలం వారం రోజుల్లోనే 3 వేలకు పైగా మరణాలు..!

చిన్న ట్రిక్ ద్వారా వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్‌లు చూడవచ్చు..!