ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఈ నెల 18 నుండి 20 వరకు మూడు రోజుల పాటు బిగ్ సేవింగ్ డేస్ పేరుతో ఓ సేల్ నిర్వహించనుంది. ఇందులో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు సాధారణ ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనున్నారు.

స్మార్ట్ ఫోన్లు, టీవీలు, యాక్సెసరీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా గాడ్జెట్లపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ స్పెషల్ సేల్ సమయంలో వినియోగదారులకు మరో అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది. కొనే వస్తువులను కేవలం ఒక్క రూపాయతోనే బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫ్రీ బుకింగ్ ను కేవలం 15, 16 తేదీలల్లోనే అందిస్తుంది. ఆఫర్ సమయంలో మిగిలిన మొత్తాన్ని చెల్లించి వస్తువును సొంతం చేసుకోవచ్చు.

ఇక ఈ సేల్ లో ముఖ్యంగా మొబైల్స్, ట్యాబ్ లెట్లపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఎక్స్ఛేంజీ సదుపాయాన్ని కూడా కల్పించనున్నారు. కాగా ఈ ఆఫర్ పొందాలనుకునే వారు ఫ్లిప్ కార్ట్ హోమ్ పేజీలోని ఫ్రీ బుక్ స్టోర్ లోకి వెళ్ళాలి. అక్కడ రూ.1 చెల్లించి ఆర్డర్ బుక్ చేసుకోవాలి. మిగతా బకాయిని సెప్టెంబర్ 18 లోగా చెల్లించాల్సి ఉంటుంది.

గత 40 ఏళ్లలో చంద్రబాబుకి ఇంత అవమానం జరగలేదు, ఇంకా ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు

సోను సూద్ మరో సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..!

కంగనా రనౌత్ పై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు