ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తమ ప్రొడక్ట్స్ ను కస్టమర్స్ కు అందించే సమయంలో ప్లాస్టిక్ ప్యాకింగ్ ను 50 శాతం తగ్గించాలని తీసుకున్న నిర్ణయంతో అన్ని వైపుల నుంచి అభినందనలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ప్లాస్టిక్ ప్యాకింగ్ ను తగ్గించుకొని పేపర్ ప్యాకింగ్ ను ఉపయోగించనున్నట్లు చెప్పుకొచ్చారు. తాము పర్యావరణానికి హానిచేసే పనులకు దూరంగా ఉండటానికి నిశ్చయించుకున్నామని అటు ప్లాస్టిక్ ప్యాకింగ్ కూడా ఎవరు వాడొద్దని అవగాహన కల్పిస్తామని చెప్పుకొచ్చారు.

ఇప్పటికే ప్రధాని మోదీ ప్లాస్టిక్ ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నా పెద్ద పట్టణాల నుంచి చిన్న గ్రామాల వరకు ప్లాస్టిక్ వాడకం పెరిగిపోవడంతో వాటి నుంచి బయటపడలేక ప్రజలు ఇంకా వాటిని వాడుతూనే ఉంటున్నారు. ప్లాస్టిక్ వలన జరిగే అనర్ధాల గురించి ఎంత చెబుతున్నా ప్లాస్టిక్ నుంచి ప్రజలు దూరంగా జరగలేకపోతున్నారు. ఇలా ఎవరికివారు ప్లాస్తిక్ల్ వాడకూడదని నిర్ణయం తీసుకుంటే తప్ప మన పర్యావరణం మనం కాపాడుకోలేము.

గొంతు కోస్తానని బెదిరించడంతో ఆరు సిక్స్ లతో సమాధానం చెప్పా

కేవలం 150 రూపాయల కోసం ఫ్రెండ్ ను హత్య చేసాడు