ఆన్ లైన్ బిజినెస్ లో సంచలనాలు సృష్టిస్తున్న ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కిరాణా షాపులతో కలసి ముందుకు అడుగులు వేయాలని చూస్తుంది. ఇప్పటి వరకు కిరాణా వస్తువులు కాకుండా అన్ని రకాల వస్తువులను తన ఫ్లిప్ కార్ట్ సంస్థ ద్వారా అందుబాటులో ఉండగా, వినియోగదారులకు మరింత చేరువ కావడమే కాకుండా… మరింత మందిని వినియోగ దారులను తన ఫ్లిప్ కార్ట్ సంస్థలో చేర్పించుకునే దానిలో భాగంగా ఇలా అడుగులు వేస్తుంది.

దేశంలోని 700 నగరాలలో సుమారుగా 27 వేల కిరాణా దుకాణాలతో జత కట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇక నుంచి మీకు ఎలాంటి కిరాణా సరుకులు కావాలనుకున్న ఫ్లిప్ కార్ట్ లో అతి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ సంస్థకు దేశ వ్యాప్తంగా 16 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వాటిని మరింత పెంచుకునే దిశలో ఫ్లిప్ కార్ట్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ 27 వేల కొత్త ఒప్పందాలు సహాయపడతాయి.

దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలను చేరువయ్యేందుకు కిరాణా దుకాణాలు బాగా ఉపయోగపడతాయని భావిస్తున్నామని ఫ్లిప్ కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి తెలియచేశాడు. ఇప్పటికే కిరాణా బిజినెస్ లో బిగ్ బాస్కెట్ తో పాటు, జొమాటో లాంటి అనేకమైన ప్రముఖ సంస్థలు ఉండటంతో ఆ మార్కెట్ పట్ల వినియోగదారుడు ఆసక్తి చూపుతుండటంతో ఫ్లిప్ కార్ట్ కూడా అటు వైపుగా అడుగులు వేస్తుంది. ఫ్లిప్ కార్ట్ రానుండటంతో త్వరలో అమెజాన్ కూడా ఈ రంగంపై ద్రుష్టి పెట్టే అవకాశం ఉందేమో.

  •  
  •  
  •  
  •  
  •  
  •