ఒక్కోసారి చేసే చిన్న చిన్న పొరపాట్లు కొన్ని సంస్థలు బారి మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అందులో భాగంగా ఫ్లిప్ కార్ట్ ఈ కామర్స్ సంస్థకు నాగాలాండ్ నుంచి డెలివరీ కావాలని ఒక వ్యక్తి ఆర్డర్ పెట్టాడు. కానీ అతడి ఆర్డర్ క్యాన్సిల్ కావడంతో అతడు మళ్ళీ పెట్టడంతో పాటు ఫ్లిప్ కార్ట్ అతడికి బదులిస్తూ మీరు తమ దగ్గర షాపింగ్ చేయాలన్న ఆసక్తికి తాము ఆనందిస్తున్నామని, కానీ తమ అమ్మకందారుల భారత్ వెలుపల మాత్రమే ఉన్నారని, భారత్ బయట లేరని చెప్పడంతో అది పెద్ద వైరల్ గా మారింది.

దీనితో నెటిజన్స్ ఫ్లిప్ కార్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగాలాండ్ అనే రాష్ట్రం భారత్ భూభాగంలో ఉందని, ఇలా భారత్ కంపెనీ మన దేశ రూపురేఖలు, రాష్ట్రాల గురించి తెలియకుండా ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం ఎలా చేస్తుందని ఫ్లిప్ కార్ట్ సంస్థ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో యాజమాన్యం చేసిన తప్పుని తెలుసుకొని తాము పొరపాటు చేశామని అంగీకరించి నాగాలాండ్ తో సహా దేశంలో అనేక ప్రాంతాలలో తమ సేవలను అందించడానికి కృషి చేస్తామని వివరించారు.