అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరూ’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుంది. ఇక ఈ సినిమా గుంటూరు ఏరియా హక్కులను దర్శకుడు మెహర్ రమేష్ దక్కించుకున్నాడు. కన్నడంలో మంచి హిట్స్ సాధించిన ఈ దర్శకుడు తెలుగులో తీసిన సినిమాలన్నీ భారీ డిజాస్టర్ గా మిగిలాయి.

ఇక మహేష్ బాబు ఫ్యామిలీ పార్టీస్ లో తరుచుగా కనిపించే మెహర్ రమేష్ ను మహేష్ భర్య నమ్రత రికమండ్ చేయడంతో గుంటూరు హక్కులను దక్కించుకున్నారంటున్నారు. గతంలో మహేష్ హీరోగా వచ్చిన ‘బాబీ’ సినిమాలో మహేష్ ఫ్రెండ్ గా నటించాడు మెహర్ రమేష్. ఇక దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.