వరుసగా రెండు సినిమాలు హిట్ అయితే చాలు ఈరోజులలో దర్శకులు వారి రెమ్యూనరేషన్ అమాంతం 10 కోట్లు, 15 కోట్లు అంటూ నిర్మాతల గుండెలలో ఫిరంగులు దింపుతున్నారు. తీరా నమ్మి సినిమా తీస్తే చివరకి నట్టెట్ట ముంచడం దర్శకులు అందెవేసిన చెయ్యిగా తయారయ్యారు. ఇదే కోవకు చెందిన ఒక డైరెక్టర్ ఒక యువ హీరోతో సినిమా తీసి సంక్రాంతి సీజన్ లో విడుదల చేసి దారుణంగా దెబ్బతీశాడు. దాదాపుగా సినిమాకు 75 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయించాడు. 

చివరకు ఆ సినిమా గురించి హీరో తన అభిమానులను ఉద్దేశించి ఇంత చెత్త సినిమా తీసినందుకు క్షమించండి అనే రీతిలో ఒక బహిరంగ లేఖ కూడా విడుదల చేయడం గమనార్హం. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఆ దర్శకుడు ఏ నిర్మాత తన తలుపు తట్టినా తనకు 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కావాలని, తాను తీసే సినిమాకు 70 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అవుతుందని చెప్పడంతో నిర్మాతలు అటు వైపు వెళ్లడమే మానేశారు.

ఇదే దర్శకుడితో ఒక తమిళ హీరోతో సినిమా తీయాలని నిర్ణయించుకోగా, సంక్రాంతి సీజన్ లో ఈ దర్శకుడు కొట్టిన దెబ్బకు ఆ హీరో మరో దర్శకుడితో సినిమాను అంగీకరించాడు. కానీ ఇంత జరుగుతున్నా ఆ దర్శకుడు మాత్రం మొండి పట్టుదలతో నాతో సినిమా తీయడానికి ఎవరో ఒకరు వస్తారులే అన్నట్లు ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ సినిమా విడుదలై ప్లాప్ అయితే తిరిగి నిర్మాతను ఆదుకుంటాడా అంటే అది లేదు. తన డబ్బులు మాత్రం తనకు సమయానికి ఇవ్వాలి. ఒకవేళ సినిమా ఫట్ అయినా మొత్తం నిర్మాతే భరించాలి. ఇలాంటి దర్శకులు ఉండబట్టే చాల మంది నిర్మాతలు మొదటి సినిమాకే అప్పుల ఊబిలో కూరుకుపోయి జీవితాలను రోడ్డు పాలు చేసుకుంటున్నారు. 
  •  
  •  
  •  
  •  
  •  
  •