స్విగ్గీ ద్వారా ఫుడ్ డెలివరీ చేయరా బాబు అంటే బీర్లు సరఫరా చేస్తున్నాడు ఒక ప్రబుద్ధుడు… అదేమిటి స్విగ్గీ అనే సంస్థకు ఫుడ్ డెలివరీ చేసుకోమని కదా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, కానీ ఇలా ఈ బీర్లు గొడవ ఏమిటా అనుకుంటున్నారా ఒక్కసారి ఏమి జరిగిందో చూద్దాం.

గుజరాత్ లోని వడోదరలో మహిద అనే యువకుడు ఏడు నెలల నుంచి స్విగ్గిలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఇక స్విగ్గి ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తుంటే వస్తున్న డబ్బులు చాలకపోవడంతో తెలివిగా స్విగ్గీని అడ్డుపెట్టుకొని బీర్లు సరఫరా చేయడం మొదలు పెట్టాడు. డబ్బులు కూడా బాగా వస్తుండటంతో కస్టమర్స్ పెరగడం ఇక అదే పని మీద ఉండటంతో, పోలీసులు సాధారణ తనిఖీలలో స్విగ్గీ బ్యాగ్ చెక్ చేయగా దొరికిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఊచలు లెక్క పెట్టిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •