కన్న కొడుకుని దారుణంగా హత్య చేసాడు ప్రముఖ ఫుట్‌బాల్‌ ప్లేయర్ కెవెర్ టోక్టాస్. టర్కీలో ఫుట్‌బాల్‌ ప్లేయర్ గా ఉన్న అతను ఏప్రిల్ 23 న కరోనా లక్షణాలు ఉన్నాయన్న కారణంగా ఐదేళ్ల కొడుకు ఖాసీంతో పాటు టోక్టాస్‌ నార్త్‌ వెస్ట్రన్‌ ఫ్రావిన్స్‌లోని ఓ ఆస్పత్రిలో చేరాడు. అయితే ఖాసీంతో పాటు టోక్టాస్‌ కూడా వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ గా వచ్చింది. అయితే లక్షణాలు బయట పడవచ్చన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఇద్దరిని ఇసోలేషన్ లో ఉంచారు.

అయితే మే 4న ఖాసీంకు చికిత్య చేస్తున్న గదిలోకి వెళ్లిన టోక్టాస్ అతడి ముఖాన్ని దిండుతో నులిమి ఊపిరి ఆడకుండా చంపేశాడు. ఇక ఆ తరువాత కరోనా తో చనిపోయాడని అందరిని నమ్మించాడు. అయితే కొడుకు చనిపోయిన 11 రోజుల తరువాత పశ్చాత్తాప పడిన టోక్టాస్ పోలీసుల ముందు లొంగిపోయాడు. నా చిన్న కొడుకు ఖాసీం అంటే ఇష్టం లేదని అందుకే చంపానని చెప్పాడు. తనకు ఎలాంటి మానసిక సమస్యలు లేవని చెప్పిన టోక్టాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భారత్ కు ఆర్ధిక సహాయం ప్రకటించిన ప్రపంచ బ్యాంకు

మే 28న సీఎం క్యాంప్ ఆఫీస్ తరలింపు..?