ఈరోజు నుంచి లాక్ డౌన్ మూడవ విడతను మే 17 వరకు కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే కొన్ని సడలింపులనిస్తూ అన్ని రాష్ట్రాలలో సామజిక దూరం పాటిస్తూ మందు షాపులు తెరుచుకోవచ్చని తెలియచేసింది. దీనితో మాహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇలా కొన్ని రాష్ట్రాలు మద్యం అమ్మకాలు మొదలు పెట్టాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 11 గంటలకు తెరుచుకున్న మద్యం షాపుల ముందు తెల్లారేసరికే జనం ఉప్పెనలా కదిలొచ్చి కిలోమీటర్ల మేర నిలబడటం చూస్తుంటే మద్యం ప్రియులు ఎంతలా అల్లాడిపోతున్నారో కనపడుతుంది.

సామజిక దూరం అంటే ఏమిటి… ఈరోజు ఉదయం మందు షాపుల దగ్గర కనపడిన జనాన్ని చూస్తే అసలు సామజిక దూరం… లాక్ డౌన్ అన్నది మన ఏపీలో కొనసాగుతుందా అనిపించింది. ప్రతిఒక్కరు మూతికి మాస్క్ లు ధరించినా ఒకరినొకరు నెట్టుకోవడం మందు కోసం ఎగబడటం… తోపులాటలు… కొట్లాటలు.. పోలీసులు లాక్ డౌన్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవడం అటుంచి మందు బాబులను కంట్రోల్ చేయడమే సరిపోయింది.

ఒకవైపున చిటపటలాడే ఎండా… మరోవైపు మందు బాబుల హడావిడి… గత 45 రోజులుగా ఎడతెరపి లేకుండా డ్యూటీ చేస్తున్న పోలీసులకు ఇదెక్కడి కర్మరా బాబు అనిపించేలా చుక్కలు చూపించారు. ఇలా మందు కొనుగోలు చేయడానికి వచ్చిన వారిలో ఒక్క వ్యక్తికి వైరస్ ఉన్నా అది దావానంలా పాకి అది ఎంత దూరం వెళుతుందో తెలియదు. ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపున విపరీతంగా కేసులు పెరుగుతుంటే మద్యం షాపులు తెరవాల్సిన పనేమిటి. ఆర్ధిక పరిస్థితి బాలేదని, అందుకే సామజిక దూరం పాటిస్తూ తెరిచారని వైసీపీకి సపోర్ట్ గా నిలిచే నెటిజన్లు చెబుతున్నా నెట్టుకొవడాలు, కొట్టుకోవడాలు చూస్తుంటే మందు షాపుల దగ్గర పరిస్థితి కాస్త అనుకున్న దానికంటే బిన్నంగా ఉంది.

ఇదే విధంగా కొనసాగితే మాత్రం రాబోయే రాజులలో అత్యంత భయానక పరిస్థితులు చూడవలసి ఉంటుంది. ఇప్పటికైనా ఈరోజు జరిగిన పరిణామాలతో మద్యం షాపులను మరొక నెల రోజుల పాటు మూసివేసి వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత తెరిస్తే ప్రజారోగ్యాన్ని పరిరక్షించినవారవుతారు. ఇక బెంగళూరు లాంటి నగరాలలో అయితే మహిళల కోసం వేరే లైన్ లు పెట్టడం చూస్తుంటే మద్యంపై ప్రజలు ఎంత మోజు పెంచుకున్నారో అర్ధమవుతుంది. ఈ మద్యం షాపుల దెబ్బకు త్వరలో గ్రీన్, ఆరేంజ్ జోనులు కూడా రెడ్ జోన్ల పరిధిలోకి వెళ్లే సూచనలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

మద్యం కోసం క్యూ కట్టిన అమ్మాయిలు.. సోషల్ మీడియాలో వైరల్..!

ఏపీలో కొత్తగా మరో 67 పాజిటివ్ కేసులు.. జిల్లాల వారీగా కరోనా వివరాలు..!