ఎవడ్రా బాబు ఈ ‘బిగ్ బాస్ 3’ స్క్రిప్ట్స్ తాయారు చేస్తుందని గట్టిగా అరవాలని ప్రయత్నించినా ఈ దిక్కుమాలిన అరుపులు ఎవరకి వినపడుతాయిలే, నా నోటికే నొప్పని ఉరుకోవడమే తప్ప, లేకపోతే ఈ స్క్రిప్ట్ లు ఏమిటి ఈ ఏడుపులు పెడబొబ్బలేమిటి… అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏమి జరుగుతుంది… రోజు రోజుకి బిగ్ బాస్ రేటింగ్స్ దిగజారుతుంటే బిగ్ బాస్ యాజమాన్యం ఏమి చేస్తుంది. ఏదో సాధించేద్దామని ఒక్కసారిగా బిగ్ బాస్ రేటింగ్స్ పెంచేసుకోవచ్చని ట్రాన్సజెండర్ తమన్నా సింహాద్రిని తీసుకు వస్తే ప్రేక్షకులు పంచ్ ల మీద పంచ్ లు వేయడంతో ఎలిమినేటెడ్ అన్నాడు మన బిగ్గెర్ బాస్.

ఇక గత వారం మరో వైల్డ్ కార్డు ఎంట్రీ శిల్పా చక్రవర్తిని తీసుకు వచ్చి శ్రీముఖి – శిల్పాకు ఏవో గొడవలు ఉన్నట్లు శిల్పా ఏవో గుసగుసలు ఆడటం ఇలా ఏదో కథలు నడుస్తున్నాయి. ఈ వారం ఆలీ రెజా ఎలిమినేషన్స్ తో బిగ్ బాస్ పై ప్రేక్షకులకు మరింత వెగటు పుట్టింది. బిగ్ బాస్ హౌస్ నుంచి ఆలీ రెజా బయటకు వెళుతుండటంతో శివ జ్యోతి అలియాస్ సావిత్రక్క, శ్రీముఖి ఏడుపులు లంకించుకోవడంతో అసలు బయట ఉండి చూసే ప్రేక్షకులకు ఏమి జరుగుతుందో అర్ధం కాక జుట్టు పీకుంటున్నారు.

ఒక రియాలిటీ షోలోకి వచ్చేటప్పుడు ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ అవుతారు… చివరకు ఒకరికి కప్ ఇచ్చి లచ్చ లచ్చల బహుమానం చేతిలో పెట్టి సాగనంపుతారు. ఈ వారం ఆలీ రెజా వెళ్లిపోవడం వచ్చే వారం ఇంకో కంటెస్టెంట్ వెళ్ళిపోతారు. చివరకు అందరూ చేరాల్సింది తమ తమ ఇళ్లకే తప్ప బిగ్ బాస్ అనే గ్రహంలో మిమ్మల్నేమి పెట్టుకొని జీవితంత మేపే పరిస్థితైతే లేదు. కానీ తామేదో కొత్త ప్రపంచంలో ఉన్నట్లు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళమనట్లు మా నుంచి ఒకరిని వేరు చేస్తారా అన్నట్లు ఈ ఏడుపులేమిటో… ఈ పెడబొబ్బలేమిటో.

అంతగా ఆలీ రేజ్ ఇష్టమైతే, అతని బయటకు వెళ్ళిపోతే తట్టుకోలేవుకపోతే… అతను హౌస్ లో లేకపోతే తాము ఉండలేమన్నట్లు భావిస్తే… ఆ ఆలీ రెజాతో కలసి ఈ ఏడుపులు బ్యాచ్ కూడా బయటకు వెళ్లిపోవచ్చుగా… ఏదో కాసేపు ఎంటర్టైన్ కోసం షో చూద్దామనుకుంటుంటే, వచ్చే గంట ప్రోగ్రాంలో సగం ఈ ఏడుపులకే సమయం అయిపోతుంది.

ఈ స్క్రిప్ట్ రాస్తుందెవరో… ఎదురుగా ఉన్న నాగార్జున శివ జ్యోతి, శ్రీముఖి ఏడుపులు పట్ల మనస్సులో ఇదేమి గోలరా బాబు… సినిమాలలో కూడా ఇంతలా నటించేవారుండరు కదా.. ఇది రియాలిటీ షోనా లేక ఏడుపులు షోనా.. అన్నట్లు తయారైందని… ఇలాంటి షోకు తాను వ్యాఖ్యాతనా అని ఒక్కసారైనా మనస్సులో అనుకునే ఉంటాడు. ఇదే మాదిరిగా ఉంటే బిగ్ బాస్ పరిస్థితి ముందు ముందు ఇంకెంత దారుణమైన రేటింగ్స్ తో పడిపోతుందో తలచుకుంటేనా… పాపం బిగ్ బాస్ యాజమాన్యం అనిపిస్తుంది.

బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2 రెండింట్లో కాస్త ప్రామిసింగ్ కంటెస్టెంట్లను తీసుకోవడమే కాకుండా వాళ్ళ స్పోర్టింగ్ స్పిరిట్ తో ప్రేక్షకులను అలరించి, ప్రతివారం రేటింగ్స్ పెంచడంలో సహాయపడేవారు. బిగ్ బాస్ 3 మాత్రం ప్రతి కంటెస్టెంట్ నాకెందుకులే ఈ లొల్లి అనుకుంటూ తమ పని తాము చేసుకుంటూ ఈ వారం ఎలిమినేషన్ లో లేకుండా ఉండాలంటే… ఎలాంటి గొడవలకు తావ్వివకుండా నోట్లో బెల్లం గడ్డ పెట్టుకుంటే చాలనట్లు వ్యవహారం నడపడంతో ప్రేక్షకులు దణ్ణమెట్టి మరొక ప్రోగ్రాం వైపు పరుగులు తీస్తున్నారు.

వార్తలు చదువుతూ బిత్తిరి సత్తితో మాంచి హంగామా చేసే శివ జ్యోతి అలియాస్ సావిత్రక్క… పటాస్ షోతో ఇంటిల్లపాదిని తన అభినయంతో దుమ్ముదులిపే శ్రీముఖి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో.. అనేది అంతుపట్టకుండా ఉంటుంది. శ్రీముఖికి భారీగా పైసలిచ్చి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువస్తే ప్రేక్షకులను మాత్రం నిరాశపరుస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •