బిగ్ బాస్ 4 సీజన్ లో ప్రేక్షకుల మద్దతు ఎక్కువగా తెలంగాణ నుంచి వచ్చిన గంగవ్వపై తమ మమకారాన్ని చూపిస్తున్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన జీవనప్రయాణాన్ని ఈదిన గంగవ్వను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావడంతో పాటు ఆమె పట్ల బిగ్ బాస్ లో మిగతా కంటెస్టెంట్లు కూడా అదే రీతిలో ప్రేమ కురిపిస్తున్నారు. కానీ నిన్న హఠాత్తుగా గంగవ్వ తనకు తలనొప్పి రావడంతో ఒకరిద్దరు కంటెస్టెంట్లు ఆమె నుదిటిపై మర్దన కూడా చేశారు. దీనితో పాటు ఆమె ఆరోగ్యం కూడా కాస్త నలతగా ఉండటంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఇలా గంగవ్వ నలతగా కనిపించడంతో ఆమెకు కరోనా సోకిందేమో అన్న ఆరోపణలు బయట వినిపిస్తున్నాయి. అసలు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు 15 రోజులు క్వారంటైన్ లో ఉంచి వారిని హౌస్ లోకి తీసుకొని వచ్చారు. అలాంటప్పుడు ఇప్పుడు కరోనా వైరస్ ఎలా సోకుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ మనకు మాత్రం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మాత్రమే కనపడతారు. బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా యాక్టీవిటి జరిగేటప్పుడు అక్కడ మొత్తం సెట్ చేయడానికి పదుల సంఖ్యలో సెట్ లోకి వచ్చి వెళుతుంటారు.

ఆ టెక్నిషియన్స్ లో ఒకరిద్దరికి కరోనా సోకిందన్న వార్తలు వినిపించాయి. వారి వలన గంగవ్వకు ఏమైనా కరోనా సోకిందా అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కాస్త వయస్సు మళ్ళిన వారికి ఎక్కువగా వస్తుండటంతో ఇప్పుడు గంగవ్వను కరోనా చుట్టుముట్టిందా అన్న ఆరోపణలు వస్తున్నా దీనిపై ఇంకా క్లారిటీ లేదు. దీనిపై ఈరోజు షోలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు కనుక గంగవ్వ షోలో కొనసాగితే ఆమెకు మాములు అనారోగ్యంతో పాటు పల్లెటూరు వాతావరణంలో బతికొచ్చిన గంగవ్వ బిగ్ బాస్ వాతావరణానికి ఇబ్బంది పడుతుండటంతోనే ఆమెకు అనారోగ్యం వచ్చిందని అనుకోవచ్చు. ఇప్పటికే గంగవ్వ తనకు ఇక్కడ ఇబ్బందిగా ఉందని తనను బయటకు పంపించాలని బిగ్ బాస్ తో పాటు హోస్ట్ నాగార్జునను కూడా కోరిన సంగతి తెలిసిందే.

రాజుగారి ఉత్సాహం చూస్తుంటే త్వరలో కొత్త పార్టీ పెట్టేలా ఉన్నారే

విజయసాయిరెడ్డి కెలుకుడు మాములుగా లేదుగా, చివరకి ఎవరి తీగ తెగుతుందో