తెలుగు బిగ్ బాస్ నాల్గవ సీజన్ మొదలైంది. ఈసారి ప్రత్యేకమైన కంటెస్టెంట్ గా యూట్యూబ్ స్టార్ గంగవ్వ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గంగవ్వ హౌస్ లోకి రావడంతో సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగిపోతుంది. గతంలో బిగ్ బాస్ చూడనివారు కూడా గంగవ్వ కోసం బిగ్ బాస్ చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇక గంగవ్వ హ్యాష్ టాగ్ మొదటి రోజే జాతీయస్థాయిలో ట్రెండ్ అయ్యింది అంటే ఆమెకు ఉన్న పాపులారిటీ అర్ధం చేసుకోవచ్చు.

ఇక మొదటిరోజే కుటుంబ సభ్యుల మధ్య రచ్చ మొదలైంది. ఇక హౌస్ లో ఉన్న 14 మందిలో నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టాడు బిగ్ బాస్. ఇక గంగవ్వ మొదటి వారంలోనే ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యింది. దానికి ఓ రీజన్ కూడా చెప్పుకొచ్చారు ఇంటిసభ్యులు. బయట గంగవ్వకు మంచి పాలోయింగ్ ఉంది కాబట్టి జనాలు ఎలాగైనా ఆమెకు ఓట్లు వేస్తారని.. కావున గంగవ్వ ఇంటి నుండి వెళాల్సిన అవసరం ఉండదన్నారు. ఇక చాలా మంది ఇప్పటికే గంగవ్వను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. గంగవ్వకు ఈసారి అత్యధికంగా ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలోనే ఏ కంటెస్టెంట్ కి రాని ఓట్లు గంగవ్వకు వస్తున్నట్లుగా తెలుస్తుంది.

చంద్రబాబు ఇలాంటి ప్రశ్న ఊహించి ఉండకపోవచ్చు, కానీ నిజమే కదా?

సంచయిత గజపతిరాజు దెబ్బకు టీడీపీ నాయకులు అడ్డంగా ఇరుక్కుపోయారుగా.!

WHO హెచ్చరిక.. ఇదే చివరి మహమ్మారి కాదు..!