బుల్లితెరపై అతి త్వరలో బిగ్ బాస్ సందడి మొదలు కాబోతుంది. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. నాల్గవ సీజన్ కు రెడీ అవుతుంది. గత సీజన్లో వ్యాఖ్యాతగా వచ్చిన కింగ్ నాగార్జునే .. ఈ సీజన్ కు వ్యాఖ్యాతగా వస్తున్నాడు. కరోనా వైరస్ సమయంలో భౌతిక దూరం పాటించే విధంగానే ఈసారి హౌజ్ లో టాస్క్ లు ఉంటాయన్న ప్రచారం కూడా సాగుతుంది.

తెలంగాణలో కాదు తెలుగు ప్రజల్లో మై విలేజ్ షో ద్వారా గంగవ్వకు మంచి గుర్తింపు వచ్చింది. పల్లెటూరు అవ్వగా గంగవ్వ క్రేజ్ అంతా ఇంతా కాదు. దీంతో బిగ్ బాస్ 4లో ఈసారి గంగవ్వ ఉండబోతున్నట్లు ప్రచారం సాగుతుంది. ఆమెతో ఇప్పటికే చర్చలు జరిగాయని, ఆమె కూడా ఒప్పుకుందని ప్రచారం సాగుతుంది. బిగ్ బాస్ షో రూల్స్ ప్రకారం పార్టిసిపెంట్స్ అంతా 14 రోజుల క్వారెంటైన్ కావాల్సి ఉంది. దీంతో గంగవ్వను కూడా క్వారెంటైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ యాసతో చుట్టు పక్కన వాళ్ళ గుండెళ్లో రైళ్ళు పరిగెత్తించే గంగవ్వ.. ఇంటి సభ్యులతో ఫుల్ కామెడీ చేస్తుందని భావించిన నిర్వాహకులు ఆమెని ఎంపిక చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరగుతుంది.

టీవీ చూసినా, క్యారమ్ బోర్డ్ ఆడినా, పాటలు విన్నా బారి జరిమానా తప్పదు

తెలంగాణలో రికార్డు స్థాయిలో నమోదైన పాజిటివ్ కేసులు..!