జీవితంలో ఎన్నో కష్టాలను చూసి భర్త వదిలేసి వెళ్ళిపోతే తన బిడ్డలను సాకి వారికి పెళ్లిళ్లు చేసిన ఎన్నో కష్టాలతో జీవితాన్ని నెట్టుకొచ్చిన ఒక తెలంగాణ ముసలవ్వ కథ యూట్యూబ్ లో అనేక వీడియోలు ఉన్నాయి. ఆమె జీవితాన్ని చూసి ఎన్ని కష్టాలు ఉన్న ఎదుర్కొంటూ పోరాడవచ్చని అనేక సందేశాలు కూడా ఉన్నాయి. అలాంటి గంగవ్వను బిగ్ బాస్ యాజమాన్యం బిగ్ బాస్ షోలోకి తీసుకువచ్చి మరింత బిగ్ బాస్ కు వన్నెతెచ్చి రేటింగ్స్ పిండుకోవాలని బలే ప్లాన్ వేసింది.

బిగ్ బాస్ వేసిన ప్లాన్ మొదటి రెండు వారాలు బాగానే వర్క్ అవుట్ అయింది. గంగవ్వ ఎలిమినేషన్ రౌండ్ లోకి వచ్చిన వెంటనే ఆమెకు విపరీతంగా నెటిజన్స్ సపోర్ట్ చేయడంతో ఆమెను ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో సభ్యులెవరూ నామినేట్ చేయడం లేదు. ఒకవేళ గంగవ్వను కనుక నామినేట్ చేస్తే బయట తమపై నెగెటివ్ పడుతుందని అందరూ భయపడుతూ ఆమెను నామినేట్ చేయడం లేదు.

కానీ బయట నెటిజన్స్ మాత్రం గంగవ్వ షోలో ఉండటం వలన షో అంత బాగా రక్తి కట్టడం లేదని, కొంతమంది సేఫ్ గేమ్ ఆడుతూ గంగవ్వను నెత్తిన పెట్టుకొని ఆమె భజన చేస్తూ, ఆమె ఏమి మాట్లాడినా ఆమెకు ఎదురు చెప్పకుండా సైలెంట్ గా వారి పని వారు చేసుకుంటున్నారు. దీనితో ఇప్పుడు రోజు రోజుకి బిగ్ బాస్ రేటింగ్స్ తగ్గిపోవడంతో పాటు బిగ్ బాస్ అన్ని సీజన్లలో బిగ్ బాస్ 4నే అత్యంత చెత్త రేటింగ్స్ తో నష్టాల బాట ఖాయంగా కనపడుతుంది. ఇన్ని రోజులు గంగవ్వ మీద అభిమానంతో బయట ఆమెకు సపోర్ట్ చేసినా రాబోయే రోజులలో గంగవ్వ ఇక హౌస్ లో ఉంటే అది టాస్క్ లు చేసే సమయంలో కావచ్చు మరేదైనా డిస్కషన్ లో ఆమె పాత్ర నామమాత్రం కాబట్టి ఆమె ఇక హౌస్ అవసరం లేదని వాదిస్తున్నారు. చూద్దాం బిగ్ బాస్ గంగవ్వను ఎన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉంచాలని డిసైడ్ అయ్యాడో.