బీసీసీఐ చైర్మన్ గా గంగూలీ పగ్గాలు చేపట్టిన తరువాత తన మార్క్ చూపించడానికి ప్రయత్నించడంలో భాగంగా బంగ్లాదేశ్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ విషయంలో డే/నైట్ టెస్ట్ జరిగేలా తన వంతు కృషి చేయడంతో సత్ఫలితాన్నిచ్చింది. దీనిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఒప్పించడానికి కేవలం మూడు సెకన్లు మాత్రమే పట్టిందని డే/నైట్ టెస్ట్ గురించి చెప్పగానే కోహ్లీ కూడా ఆసక్తి చూపించాడని చెప్పుకొచ్చాడు.

గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన గులాబీ టెస్ట్ కు డే/నైట్ సిరీస్ ఎందుకు అంగీకరించలేదో తెలియదని చెప్పుకొచ్చాడు. ఖాళీ స్టాండ్ల మధ్యన ఆడుతూ టెస్ట్ సిరీస్ లను ఎలా ముందుకు తీసుకెళ్లగలమని గంగూలీ పేర్కొన్నాడు. డే/నైట్ సిరీస్ ఎలా జరుగుతుంది, ఎంతలా విజయవంతమవుతుంది అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పొట్టి ఫార్మేట్ క్రికెట్ వచ్చిన తరువాత టెస్ట్ లపై ప్రేక్షకులలో ఆసక్తి తగ్గడంతో స్టేడియంకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. దీనితో డే/నైట్ టెస్ట్ సిరీస్ ల వలన ప్రేక్షకులను మరింత ఎక్కువగా స్టేడియం లకు తీసుకురావచ్చని, ఫెడ్ లైట్ వెలుగులతో గులాబీ బంతితో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. ఈరోజు బంగ్లాదేశ్ తో మొదటి టీ 20 మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా మొదలుకానుంది.