చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో సామాన్య ప్రజలు అతడిని విశాఖ నగరానికి రానివ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంది. విశాఖలో రాజధాని వద్దని ఇష్టమొచ్చినట్లు మాట్లాడే చంద్రబాబు ఎవరని ఉద్ధరించడానికి విశాఖ పర్యటనకు వస్తున్నాడని, చంద్రబాబుని రానివ్వమని “గో బ్యాక్ బాబు” అంటూ నిరసనలు తెలియచేస్తున్నారు.

చంద్రబాబు నాయుడుల పర్యటనలో ఎక్కడ విశాఖ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కనపడటం లేదు. సీఎం జగన్ ఎప్పుడైతే విశాఖను రాజధానిగా ప్రకటించారో అప్పటి నుంచి గంటా శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని దశాబ్దాలుగా వెనుకబాటుకు గురవుతున్న తమ ప్రాంతం ఇప్పటికి రాజధానిగా రావడంతో పాటు తమ ప్రజల జీవితాలు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

గతంలో కూడా నేరుగా జగన్ నిర్ణయాన్ని సమర్ధించిన గంటాను… చంద్రబాబు నాయుడు బతిమిలాడి, బుజ్జగించుకొని మీడియా ముందు గంటా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నివారించగలిగారు. ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకొని రెండు రోజులు ఉత్తరాంధ్రలో బాబు పర్యటించాలనుకుంటే బాబుని అడ్డుకుని వెనక్కు పంపేయాలని చూస్తున్నా బాబుకి మద్దతు తెలియచేయడానికి రాకపోవడం చూస్తుంటే గంటా శ్రీనివాసరావు అసలు టీడీపీ పార్టీలో ఉన్నాడా అనిపిస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •