భారతీయ జనతా పార్టీ లో చేరుతున్న తెలుగుదేశం నాయకులంతా బలే కామెడీ చేస్తున్నారు. బీజేపీలో చేరుతుంది చంద్రబాబు విధానాలను వ్యతిరేకిచ్చి కాదంట… తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో నాయకులు ఎవరు లేరని అందుకే టీడీపీని వదిలి బీజేపీలో చేరుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీ నుంచి బీజేపీలో చేరితే… ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన గరికపాటి మోహన్ రావు కూడా వారి బాట పట్టారు.

నేను బీజేపీలోకి వెళ్లిన తెలుగుదేశం పార్టీ బాగుండాలని గరికపాటి వ్యాఖ్యలు చేస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఒక పార్టీ వదిలి మరొక పార్టీలోకి వెళితే తాను చేరే పార్టీ గొప్పగా ఉండాలని అనుకోవాలి తప్ప ఇదేమిటి వదిలి వెళుతున్న పార్టీ బాగుండాలని కోరుకోవడం. అదే మరి చంద్రబాబు నాయుడు రాజకీయ చతురత అంటే… పైకి తిడుతున్నట్లు నటిస్తూ… అదే పార్టీలోకి తన అనుచరులను పంపించి లోలోన వ్యవహారాలు నడిపిస్తుంటారు.

పదే పదే గరికపాటి మాట్లాడుతూ చంద్రబాబు బాగుండాలనుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు రావాలని కోరుకుంటున్నా అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని చిన్నాభిన్నం చేయడానికి బీజేపీ కంకణం కట్టుకుంటుంటే ఈ గరికపాటి ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు. ఇంతకు అమిత్ షా – మోదీలకు బీజేపీ నేతలెవరైనా గరికపాటి మాటలు చేరవేశారా లేక… యధా ప్రకారం గుంపులో గోవింద వలే చూసి చూడనట్లు వ్యవహరించారా?

తెలుగుదేశం రాజ్యసభ సభ్యులంతా పార్టీని వదిలి బీజేపీలోకి వెళ్తుంటే చంద్రబాబు నాయుడుకి చీమ కుట్టినట్లైనా లేదనుకుంటా… తాను పెంచి పోషించిన నాయకులు బీజేపీలోకి వెళ్లి నాకోసం పని చేస్తే… పార్టీని నమ్ముకున్న క్యాడర్ మాత్రం ఎప్పుడు నాతోనే ఉండి ఊడిగం చేయాలని చంద్రబాబు బావిస్తుండవచ్చు. లేకపోతే చంద్రబాబు నాయుడు కనుసన్నలలో పెద్ద వృక్షాలుగా ఎదిగి.. ఆర్ధికంగా బలోపేతమైన వారు పార్టీని వదిలి వెళుతుంటే వారితో కనీసం సంప్రదింపులు కూడా జరపడం లేదు. అంతే గురు చంద్రబాబు రాజకీయం అంటే అలానే ఉంటుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •