విశాఖలో గురువారం తెల్లవారు జామున ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జి పాలిమర్స్ లో రసాయనిక వాయువు లీకేజ్ అవడంతో అక్కడ తీవ్ర కలకలం రేపింది. నగరంలోని ఆర్ఆర్ వెంకటాపురం పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ నుండి 3 కిలోమీటర్ల మేర వాయువు లీక్ అవడంతో ప్రజలందరూ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తెల్లవారి జామున 3 గంటలకు గ్యాస్ లీకవడంతో అందరూ నిద్రమత్తులో ఉన్నారు. ఆ సమయంలో లీక్ అవడం వల్ల ఏం జరుగుతుందో తెలియక అందరూ రోడ్ల మీదకు పరిగెత్తుకు వచ్చారు. ఈ క్రమంలో కొందరు అపస్మారక స్థితిలోకి చేరుకొని రోడ్ల మీదే పడిపోయారు.

ఇక ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతులంతా వెంకటాపురానికి చెందిన వారే. ఇక ఈ గ్యాస్ లీకేజ్ ఘటనతో కేజీహెచ్ కు భాదితుల సంఖ్య పెరుగుతుంది. ఇక పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కాగా గ్యాస్ లీకేజీ కావడంతో గంగరాజు అనే స్థానికుడు ప్రాణభయంతో పరుగులు తీస్తూ కళ్ళు సరిగా కనిపించకపోవడంతో బావిలో పడి మృతి చెందాడు. గ్యాస్ తీవ్రతకు పలు ప్రాంతాల్లో పశువులు మృతి చెందగా, చెట్లు, మొక్కలు నల్లగా మాడిపోయాయి.

ఇక మరి కొందరు బయటకి రాలేక ఇళ్లలోనే ఉండిపోయారు. ఇక జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రతి ఇంటిని చెక్ చేస్తున్నారు. ఇక పరిశ్రమకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలను ఖాళి చేయించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు వెంకటాపురానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టాయి. ఇక రసాయనిక వాయువు పీల్చి ఇంకా చాల మంది ఇళ్లలోనే ఉండిపోవడంతో పోలీసులు, స్థానిక యువత తలుపులు పగలగొట్టి వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. కాగా సాయంత్రానికి బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.

gas insident rr venkatapuram

విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య..!

గ్యాస్ లీకేజ్ ఘటన.. విశాఖకు సీఎం జగన్..!

ప్రపంచ దేశాలను మరోసారి హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ..!