విశాఖలో ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జి పాలిమర్స్ నుండి గురువారం తెల్లవారు జామున రసాయనిక వాయువు లీకేజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఘటనలో ఇప్పటికే 8 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఎల్జి పాలిమర్స్ నుండి లీకైన గ్యాస్ చాలా ప్రమాదమట. ఈ పరిశ్రమ నుండి స్టెరీన్ అనే గ్యాస్ లీకైనట్లు తెలుస్తుంది. ఈ గ్యాస్ వల్ల మొదట తలనొప్పి, వినికిడి సమస్య, నీరసం కళ్ళ మంటలు వస్తాయట. ఇక తరువాత ఇది నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక తీవ్రమైన మానసిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందట. ఇక మెదడు, కిడ్నీలపై కూడా తీవ్ర ప్రభావం చూపి పరిస్థితి విషమెక్కుతుందంటున్నారు.

ఇక గ్యాస్ ప్రభావానికి ఉక్కిరిబిక్కిరైన స్థానికులు ఎటు వెళ్తున్నారో కూడా తెలియకుండా పరుగులు తీసే పరిస్థితి ఏర్పడింది. ఇక ఆర్ఆర్ వెంటకటాపురంతో పాటు విశాఖ 66వ వార్డుపై కూడా దీని ప్రభావం బాగా పడుతుందట. దాదాపు 300 మంది విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైనట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇక ఈ ఘటనలో ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోగా మరో 30 మంది పరిస్థితి ఆందోళన కరంగా ఉందని అంటున్నారు. కాగా సాయంత్రానికి బాధితుల సంఖ్య పెరుగుతుందని సమాచారంగా ఉంది.

దేశవ్యాప్తంగా చాపకింద నీరులా కరోనా వైరస్.. 1783 కి చేరిన కరోనా మరణాలు..!

ట్రక్కులో ప్రేమికులు రహస్యంగా వెళ్తుండగా.. అదుపులోకి తీసుకున్న పోలీసులు..!

ప్రపంచ దేశాలను మరోసారి హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ..!