టీమిండియాలో నాలుగవ స్థానం నుంచి ఎవరు బరిలోకి దిగాలన్న లొల్లి ఇప్పట్లో ముగిసేలా లేదు. నిన్న విండీస్ తో జరిగిన మ్యాచ్ లో పంత్ ను నాలుగవ స్థానంలో బరిలోకి దింపడంతో కేవలం 20 రన్స్ కే అవుటయ్యాడు. ఇక దీనికి సంబంధించి కోహ్లీ మాట్లాడుతూ ఇక నుంచి పంత్ ను నాలుగవ స్థానంలో కొనసాగించాలని టీమిండియా భావిస్తుందని తెలియచేశాడు.

కోహ్లీ చేసిన వ్యాఖ్యల పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యతిరేకించాడు. పంత్ ను నాలుగవ స్థానం ఆడించడం కన్నా శ్రేయాస్ అయ్యర్ ను నాలుగవ స్థానంలో ఆడించి పంత్ ను 5వ స్థానంలో బరిలోకి దింపితే మ్యాచ్ ఫినిషర్ గా పనికొస్తాడని, 5, 6 స్థానాలు మ్యాచ్ ఫినిషర్ గా అతడి ఆట శైలికి పనికొస్తాయని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.