వరుస సినిమా సూపర్ హిట్లతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో మాఫియా డాన్ గా మహేష్ కనిపించబోతున్నాడు. దర్శకుడు వంశీ ఇప్పటికే ఫుల్ స్రిప్ట్ ను రెడీ చేసాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక ఈ సినిమా తరువాత మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మహేష్ సినిమాను నిర్మించనున్నాడు. ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. మహేష్ బాబు కి ప్రశాంత్ నీల్ వినిపించిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్-2’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ సినిమా పనులను ప్రారంభిస్తాడు ప్రశాంత్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తాడు.

  •  
  •  
  •  
  •  
  •  
  •