అమెరికాలో పోలీసులు అన్యాయంగా ఓ వ్యక్తిని చంపడంతో అక్కడ పలు నగరాల్లో ఆందోళనలు భారీగా చెలరేగుతున్నాయి. అమెరికాలోని మినియాపొలిస్ ప్రాంతంలో 46 ఏళ్ళ జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్ మెడపై పోలీస్ ఒకరు మోకాలితో తొక్కి పెట్టడంతో అతను ఊపిరాడక చనిపోయాడు. ‘దయచేసి నా గొంతు మీద కాలు తీయండి. ప్రాణం పోయేలా ఉంది వదిలి పెట్టండి సార్’ అని అతడు విలవిలలాడుతూ వేడుకున్నా కూడా ఆ పోలీస్ కనికరించలేదు. దీంతో అతను ఊపిరాడక మృతి చెందాడు. ఇక ఈ ఘటన పట్ల పోలీసులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ హత్యకు కారణమైన పోలీస్ చావిన్‌పై మొదట థర్డ్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. అయితే ఈ మర్డర్ జరిగినప్పుడు మరో ముగ్గురు పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. వీరు కూడా చావిన్ కు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. కావున జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబం ఆ నలుగురికి శిక్ష పడాల్సిందేనంటూ డిమాండ్ చేస్తుంది.

హత్యా సమయంలో చావిన్ కు మిగతా ముగ్గురు కూడా సహాయ పడినట్లు కోర్టు తేల్చింది. ఇదిలా ఉంటే చావిన్‌పై నమోదైన థర్డ్ డిగ్రీ మర్డర్‌ కేసును సెకండ్ డిగ్రీ మర్డర్‌ కింద మార్చుతూ కోర్టు తీర్పునిచ్చింది. థర్డ్ డిగ్రీ మర్డర్‌తో పోల్చితే సెకండ్ డిగ్రీ మర్డర్‌ కింద జైలుశిక్ష 15 ఏళ్లు ఎక్కువుగా పడుతుంది. ఇక మొత్తంగా చావిన్ కు నలభై ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు.

మహారాష్ట్రలో ఒక్కరోజే 123 మంది మృతి..!

ఎయిమ్స్ లో భారీగా విస్తరిస్తున్న కరోనా వైరస్.. ఆందోళనలో యాజమాన్యం..!