శనివారం యంగ్ హీరో నితిన్ నిశ్చితార్ధం ఘనంగా జరిగింది. కొంత మంది సన్నిహితులు, మిత్రులు, బంధువుల మధ్య హైదరాబాద్ లో ఈ కార్యక్రమం జరిగింది. షాలిని అనే అమ్మాయిని నితిన్ గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16న అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో దుబాయిలో వీరిద్దరి పెళ్లి జరగనుంది. ప్రీ వెడ్డింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నితిన్.. పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయని తెలియచేసాడు.

ఇక నితిన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘బీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు నితిన్ నటిస్తున్న మరో మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.