నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని నటించి, ఆమెతో సినిమాలు, పార్కులకు తిరుగుతూ బాగా డబ్బులు గుంజి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే ముందు రోజు అతడు ఇచ్చిన షాక్ తో ప్రేమించిన అమ్మాయికి దిమ్మతిరిగింది. హైదరాబాద్ యూసఫ్ గుడాకు చెందిన ఒక యువతీ దగ్గర్లోనే ఉండే దూరంగా ప్రసాద్ ను ప్రేమిస్తుంది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న వారు పెద్దలను ఒప్పించి కిందా మీద పడి ఆ అమ్మాయిని అతడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. పెళ్ళికి కట్న కానుకలు అన్ని భారీగా ముట్టచెప్పారు.

అన్ని పనులు ముగించుకొని రేపు పెళ్ళి పీటలెక్కుతారనుకునే సమయానికి ఒక రోజు ముందు యువతీ ఫోన్ కు దుర్గ ప్రసాద్ కు గత కొద్ది రోజుల క్రితం వేరొక యువతితో పెళ్లైందన్న ఫోటోలు పంపించారు. ఇది నిజామా అబద్ధమా అన్ని తెలుసుకునే లోపు… అసలు ఆ ఆఫొటోలను పంపించి దుర్గా ప్రసాద్ అని తెలిసి షాక్ కు గురైంది. దీనితో ఆ యువతీ ఏమి చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించి తనను ప్రేమ పేరుతో వంచించి నాలుగేళ్లుగా తిప్పించుకొని నా చేత భారీగా డబ్బులు ఖర్చుపెట్టించి, ఇప్పుడు కట్నం కూడా వసూలు చేసి మరొక పెళ్లి చేసుకున్నదంటూ బంజారాహిల్స్ లో కేసు పెట్టడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.