కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా మద్యం షాపులు మూసివేశారు. అయితే మొన్న సోమవారం నుండి పలు రాష్ట్రాలలో మద్యం షాపులు ఓపెన్ చేయడంతో మందు బాబులు భారీ ఎత్తున మద్యం కోసం షాపుల వద్దకు చేరుకున్నారు. అయితే మేము ఏం తక్కువా అన్నట్లు అమ్మాయిలు కూడా వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. బెంగుళూరులోని మద్యం దుకాణం ఎదుట మహిళలు క్యూ కట్టగా వారి కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా తెలంగాణాలో బుధవారం నుండి మద్యం షాపులు ఓపెన్ చేయడంతో మందుబాబులు భారీగా షాపులకు తరలి వచ్చారు. ఇక అక్కడ అమ్మాయిలు కూడా మద్యం కోసం ఉదయమే షాపులకు వచ్చారు. హైదరాబాద్ కొండాపూర్ లో ఓ మద్యం షాపు వద్ద మందు బాబులకు పోటీగా అమ్మాయిలు కూడా లైన్ లో నిల్చున్నారు. సామాజిక దూరం పాటిస్తూనే మొహాలకు మాస్కులతో అమ్మాయిలు ముందు కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దేశవ్యాప్తంగా తీవ్రంగా విజృంభిస్తున్న కరోనా.. 50000 చేరువలో పాజిటివ్ కేసులు..!

ముఖ్యమంత్రి కారు డ్రైవర్ కు కరోనా పాజిటివ్ రావడంతో తీవ్ర కలకలం..!

గుడ్ న్యూస్.. కరోనాకు వ్యాక్సిన్ సిద్ధం చేశామని ప్రకటించిన ప్రముఖ దేశం..!