కేవలం 5 రూపాయలకే బంగారాన్ని కొనవచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదా.. అవును ఇది నిజమే. ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కు చెందిన ‘అమెజాన్ పే’లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీంతో యూజర్లు కేవలం రూ.5 కే డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అంటే బంగారంలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇందుకోసం సేఫ్ గోల్డ్ అనే సంస్థతో అమెజాన్ ఒప్పందం చేసుకుంది. ఇందులో మీరు మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా కొద్దికొద్దిగా డిజిటల్ గోల్డ్ కొని దాచుకోవచ్చు. రూ.5 నుంచే మీ సేవింగ్స్ మొదలుపెట్టొచ్చు.

మాములుగా భౌతిక రూపంలో బంగారాన్ని కొనాలంటే అంత తక్కువ మొత్తంలో సాధ్యం కాదు.. కానీ వర్చువల్ గోల్డ్‌ను ఎంత తక్కువ మొత్తంలో అయిన కొనుగోలు చేయవచ్చు. ఎప్పటికప్పుడు గోల్డ్‌ను వర్చువల్‌గా కొంటూ బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశముంటుంది. తరువాత అవసరమనుకుంటే దాన్ని అమ్ముకోవచ్చు. ఇలా కొనే గోల్డ్ 99.5 శాతం స్వచ్ఛంగా ఉంటుందని, అది 24 క్యారెట్ గోల్డ్ అని అమెజాన్ పే వెల్లడించింది.

చైనా కరోనా వ్యాక్సిన్ 10 వేల రూపాయలట..!

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కామన్ డీపీని లాంచ్ చేసిన రామ్ చరణ్