భారతీయులకు అత్యంత ప్రీతిపాత్రమైనది బంగారం. పెళ్లిళ్లు, పేరంటాలకు నిండుగా బంగారం కొనుక్కొని ఎవరకి తగట్లు వారు వారి దర్పం చూపించుకుంటారు. కానీ కరోనా వైరస్ భయంతో రోజు రోజుకి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా పెట్టుబడి దారులలో భయాందోళనలు నెలకొని ఉండటంతో బంగారం ధర అయితే ఎప్పటికి స్థిరంగా ఉంటుందని ఇన్వెస్టర్లు బంగారం వైపు చూడటంతో బంగారం, వెండి ధరలు కొత్త పుంతలు తొక్కుతూ ప్రతి రోజు ఆల్ టైం హై రేట్లను నమోదు చేసుకుంటున్నాయి.

గత జనవరి 31న బంగారం ధరలు 10 గ్రాముల విలువ 40,780 రూపాయలు ఉంటే ప్రస్తుతం 45 వేల రూపాయలను ధాటి 50 వేల వైపు పరుగులు తీస్తున్నాయి. ఏప్రిల్ 26న వచ్చే అక్షయ తృతీయ ఇంకా నెల రోజులు పైగా ఉండటంతో అప్పటికి బంగారం ధర 50 వేల రూపాయలు దాటే పరిస్థితులున్నాయని చెబుతున్నారు. ఇక ఇలా పరుగులు తీస్తే సామాన్యుడికి బంగారం కూడా అందని ద్రాక్షగా మిగిలిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.