బాగా డబ్బుంది బలిసిన బంగారం వ్యాపారి. ఇక అతడి పుట్టినరోజు ప్రతి ఏడాది ధూమ్ ధామ్ గా చేసుకుంటాడు. కరోనా సమయంలో అతడి పుట్టినరోజు కావడంతో పెద్ద పెద్ద సెలెబ్రెటీలుతో పాటు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇలా బిగ్ షాట్స్ ను 150 మందిని పిలిచి తన 63వ పుట్టినరోజు చేసుకున్నాడు. కానీ కరోనా వైరస్ కు అతడు బలిసిన బంగారం వ్యాపారి అన్న విషయం తెలియదు కదా. దానితో అతడిని చాప చుట్టేసినట్లు చుట్టుకెళ్ళిపోయి మహా ప్రస్థానానికి దారి చూపించింది.

దీనితో ఇప్పుడు ఆ విందులో పాల్గొన్న ఎమ్మెల్యేలు, మంత్రులు హడలిపోతున్నారట. ఈ వైరస్ మమల్ని ఎక్కడ అంటుకుందో అని బయటపడిపోతున్నారు. ఇప్పటికే తెలంగాణాలో ప్రతి 100 మందిలో 20 మందికి కరోనా వైరస్ సోకడంతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు, తెలంగాణ హోమ్ మంత్రి ఇలా అనేక మంది నాయకులకు సోకడంతో ఇప్పుడు మమల్ని ఎక్కడ వైరస్ చుట్టేస్తుందో అని బెంగ.

ఇలా కరోనా వైరస్ తో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఈ సమయంలో విందులు, వినోదాలు అవసరమా అంటే… ప్రశ్నించడానికి మీరెవరు అన్నారంటారు గాని ఎంత డబ్బున్న ఏమి సుఖం ఇంట్లో కాళ్ళు కదపకుండా కూర్చోలేక డబ్బెక్కువై ఇలా విందులు చేసుకొని వైరస్ సమయంలో కూడా తమ పరపతి చూపించుకోవాలనుకొని తమ నెత్తి మీదకే తెచ్చుకుంటున్నారు. ఇలా విందులు చేసుకోకపోతే లేనివాడికి పెడితే కాస్త పుణ్యమైన వస్తుంది కదా ఈ సమయంలో… అయినా పుణ్యాలు ఎవడికి కావాలి, మన ఆర్బాటం మనకు ఉంటే చాలు. పుణ్యం అదే తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు పాపం కూడా అంతే స్పీడ్ లో వచ్చేస్తుంది జర జాగ్రత్త.

పెళ్ళైన మొదటి రాత్రే “గే” అని తేలిందంటున్న నగ్నం హీరోయిన్

కొడుకులు, కోడళ్ల ఛీత్కారంతో బతికి చెడ్డ ఒక పెద్దాయన కన్నీటి గాధ