భారీగా పెరిగిన బంగారం ధరలు కాస్త కిందకు దిగాయి. వరుసగా మూడు రోజుల పాటు బంగారం ధరలు తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర మంగళవారం నాడు రూ.1,317 తగ్గి రూ.54,763గా నమోదైంది. కిలో వెండి రేటు ఒక్క రోజే రూ.2,943 దిగజారి రూ.73,600కు పలికింది. ముంబై మార్కెట్ లో మేలిమి బంగారం రూ.1,564 తగ్గి రూ.53,951కి చేరగా.. కేజీ సిల్వర్‌ రూ.2,397 తగ్గి రూ.71,211 వద్ద క్లోజైంది. హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రూ.58,030 ధర పలికింది. 22 క్యారెట్ల రేటు రూ.53,140గా, కిలో వెండి రూ.72,500గా నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహ ధరలు తగ్గుముఖం పట్టడంతో పాటు రూపాయి మారకం రేటు బలపడడం ఇందుకు దోహదమని బులియన్ వర్గాలు తెలియచేశాయి.

రష్యా వ్యాక్సిన్‌కు భారీగా డిమాండ్.. 20దేశాల ఆర్డర్లు..!

కూతుళ్ళకు ఆస్తిలో సమాన వాటా..!

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు క్యాన్సర్..!