గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. వారం రోజుల నుండి బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో భారీగా పెరిగిన ధరలు అన్ లాక్ సమయంలో తగ్గుముఖం పట్టాయి. ఇది బంగారం కొనేవారికి శుభవార్తగా చెప్పవచ్చు.

ఇక హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గడంతో రూ.47,700 కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా 110 తగ్గడంతో 52,040 కి పరిమితమైంది. ఇక మరోవైపు కేజి వెండి ధర కూడా ఏకంగా 1,000 దిగిరావడంతో 58,000 కి వచ్చింది. ఇలా మరికొద్ది రోజులు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారం ధరలు హై రేటు నుండి 7,000 పైగా తగ్గడం కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

భార్యను కొట్టడంతో కొలువు పోగొట్టుకున్నాడు.. వీడియో వైరల్..!

సూపర్ ఓవర్లో బయటపడ్డ ఆర్సీబీ..!

సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన కమల్ హాసన్..!