కరోనా భాదితులను గుర్తించేందుకు టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇవి ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్ పార్మ్ లపై పనిచేస్తాయి. ఇవి యాప్ లు కాదు. ఆండ్రాయిడ్ సిస్టంలో ఉండే ఒక టెక్నాలజీని(API) వివిధ ప్రభుత్వాలు తయారు చేసిన కరోనా యాప్ ల కోసం వినియోగించేలా అవకాశం కల్పించాయి. ఎక్సపోజర్ నోటిఫికేషన్ సిస్టమ్ గా పిలిచే ఈ వ్యవస్థ బ్లూ టూత్ ఆధారంగా పనిచేసే కరోనా యాప్ ల సామర్ధ్యాన్ని పెంచుతుంది.

ఇక యాపిల్, గూగుల్ కలసి సంయుక్తంగా ఈ ‘కోవిడ్-19 ఎక్సపోజర్ నోటిఫికేషన్’ను తయారు చేశారు. మొత్తం 5 ఖండాలలో 22 దేశాల ప్రభుత్వాలు ఈ టెక్నాలజీ వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరాయి. ఈ జాబితాలో భవిష్యత్తులో మరిన్ని చేరే అవకాశం ఉంది. ఆయా దేశాల కాంటాక్ట్ ట్రేసింగ్ వ్యవస్థను బలపర్చేందుకు, వినియోగదారుల గోప్యతను రక్షిస్తూ కరోనాతో పోరాడాలన్నదే మా లక్ష్యం అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.

‘చంద్రముఖి-2’ సినిమాపై జ్యోతిక ఆసక్తికర సమాధానం

15 ఏళ్ళ యువతి సైకిల్ పై తన తండ్రితో 1200 కిమీ ప్రయాణం, పెద్ద సాహసమే