కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగస్థులందరు వర్క్ ప్రాం హోమ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీడియో కాల్స్ కు బాగా డిమాండ్ ఏర్పడింది. ఈ సమయంలో ఎక్కువుగా వీడియో కాల్స్ ను వాడుతున్నారు. వీడియో కాల్స్ సమావేశాలు రోజురోజుకు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో జూమ్ కు, వాట్సాప్ కు పోటీగా గూగుల్ తన కొత్త సర్వీస్ గూగుల్ మీట్ ను ప్రారంభించింది.

ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. గూగుల్ మీట్ ప్లాటుఫారంలో కొత్తగా రోజుకు 3 మిలియన్ల మంది వినియోగదారులు చేరుతున్నారని చెప్పారు. గూగుల్ మీట్.. గూగుల్ సూట్ తో పాటు వస్తుంది. కాగా ప్రతి రోజు గూగుల్ మీట్ లో 300 కోట్ల నిమిషాల పాటు సమావేశాలు జరుగుతున్నాయన్న ఆయన.. గూగుల్ మీట్ సేవలను ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందిస్తున్నామన్నారు.