హానికరమైన యాప్స్ తొలగించేందుకు గూగుల్ అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికి ఏదో ఒక విధంగా డేంజరస్ యాప్స్ గూగుల్ లో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. వీటిని కనుక మీరు పొరపాటున ఇన్ స్టాల్ చేసుకుంటే మీ ఫోన్ మొత్తం వారి కంట్రోల్ లోకి తీసుకొని, మీకు సంబంధించిన డేటా మొత్తం హ్యాకింగ్ చేసే అవకాశం ఉంది. దీనితో మీ పర్సనల్ డేటా మిస్ కావడంతో పాటు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు డేటాతో మీ డబ్బులను కూడా మీరు పోగొట్టుకునే అవకాశం ఉంది.

దీనిపై గూగుల్ ఎన్ని చర్యలు తీసుకున్నా వీరి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందే తప్ప, తరగడం లేదు. తాజాగా “లుకాస్ స్టేపాంకో” పరిశోధన సంస్థ నివేదిక ప్రకారం గూగుల్ ప్లే స్టోర్ లో వీటి సంఖ్య రోజు రోజుకి వేలలో పెరుగుతున్న సందర్భంగా వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన యాప్స్ మాత్రమే ఇన్ స్టాల్ చేసుకొని, మీకు తెలియని యాప్స్ వైపు చూడవద్దని తెలియచేస్తున్నారు.