గూగుల్ స్నాప్‌షాట్ లో గూగుల్ అనేక మార్పులు చేసింది. గూగుల్‌ అసిస్టెంట్‌ ద్వారా వాయిస్‌ కమాండ్స్‌/ టెక్ట్స్‌ కమాండ్స్‌ రూపంలో ఏదైనా సమాచారం అడిగితే మీకు అందిస్తుంది. అయితే హే గూగుల్‌/ఓకే గూగుల్‌ అంటే అసిస్టెంట్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. ఈ స్క్రీన్‌ను స్నాప్‌షాట్‌ అని అంటారు. ఈ స్నాప్‌షాట్ లో గూగుల్ తాజాగా అనేక మార్పులు చేసింది. వినియోగదారులకు మరింత ఉపయోగపడేలా సరికొత్త ఫీచర్లను తీసుకువచ్చింది.

రోజువారీ చేయాల్సిన పనులను, అలాగే మీ స్నేహితుల పుట్టిన రోజులను, చెల్లించాల్సిన బిల్స్‌, మీ వార్షికోత్సవాలు ఇలా చాలా ఆప్షన్లను ఈ స్నాప్‌షాట్‌లో పొందుపరుస్తున్నారు. స్నాప్‌షాట్‌ను యూజర్లు వినియోగించేందుకు గూగుల్‌ నూతనంగా వాయిస్‌ కమాండ్‌ను తయారు చేసింది. హే గూగుల్‌/ఓకే గూగుల్‌ కమాండ్‌తో గూగుల్‌ అసిస్టెంట్‌ను ఓపెన్‌ చేసి ‘హే గూగుల్‌ షో మి మై డే’ అనాలి. అప్పుడు స్నాప్‌షాట్ తెర మీద సమాచారం కనిపిస్తుంది.

సాధారణంగా వినియోగదారులకు వాతావరణం, రిమైండర్స్‌, షాపింగ్‌ లిస్ట్‌, కొవిడ్‌ సమాచారం లాంటివి డీఫాల్ట్‌గా ఇస్తున్నారు. ఇవి కాకుండా సెట్టింగ్స్‌ ద్వారా ఇంకొన్ని ఆప్షన్లు యాడ్‌ చేసుకోవచ్చు లేదా తీసేయొచ్చు. ఇక ప్రస్తుతానికి గూగుల్ స్నాప్‌షాట్ ఆంగ్లంలో ఉంది. త్వరలోనే ఇతర భాషలలోకి ఈ సేవలు రాబోతున్నాయి.

గుడ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ పై ట్రంప్ తాజా ప్రకటన..!

ప్రభాస్ సినిమాలో భారీ ట్విస్ట్ అదేనట..!