చుట్టూ ఎవరు లేరు కదా అని ఓ చిలిపి జంట రొమాన్స్ మొదలు పెట్టింది. అయితే గూగుల్ మాత్రం వారిని పట్టించింది. అదెలా అనుకుంటున్నారా.. తైవాన్ లోని ఓ జంట ఎవరు లేని ప్రాంతంలోకి వెళ్లి ఒకరికొకరు రొమాన్స్ చేసుకుంటున్నారు. వాళ్లిదరు కౌగలించుకుని లోకాన్ని మరిచి పోయారు. ఆ జంట ఇప్పుడు గూగుల్ లో పాపులర్ అయ్యిపోయారు.

గూగుల్ శాటిలైట్ మ్యాప్లో శాంటియాన్ రోడ్ స్ట్రీట్ వ్యూ చేసే వాళ్లకు ఈ దృశ్యం స్వష్టంగా కనిపిస్తుంది. దీనితో కొందరు ఆకతాయిలు దీన్ని ఫోటో తీసుకుని సోషల్ మీడియా లో అప్లోడ్ చేశారు. అంతకంటే ముందే.. వారి ఏకాంత దృశ్యాలను గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమెరా క్లిక్ చేయడంతో గూగుల్ మ్యాప్ లకు ఆటోమాటిక్ గా అప్లోడ్ అయ్యింది. దీనితో ఆ జంట ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.

ఇక వాస్తవానికి ఈ ఫోటో కావాలని తీసింది కాదు. 360 డిగ్రీ టెక్నాలజీ కెమెరాతో గూగుల్ స్ట్రీట్ వ్యూ చిత్రీకరించారు. దీనితో ఆ కెమెరా చుట్టూ ప్రక్కల కనిపించే దుశ్యాలను చిత్రీకరించి పొందుపరుస్తుంది. ఈ విధంగా గూగుల్ లో ఉన్న టెక్నాలజీ ప్రేమికులను పట్టించింది.